అమిత్ షా కాన్వాయ్ మీద దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్

- May 11, 2018 , by Maagulf
అమిత్ షా కాన్వాయ్ మీద దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి జరగడం సంచలనం సృష్టిస్తోంది. దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని బీజేపీ అనుమానం వ్యక్తం చేస్తుంటే.. నిరసనలు తెలిపే పద్ధతి ఇది కాదని, ఇలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. దాడి చేసిన వ్యక్తి పార్టీకి చెందిన వారైనా వారిని వెంటనే సస్పెండ్  చేయాలని ఆదేశించారు.అమిత్‌ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి ఘటన దురదృష్టకరం అని మంత్రి సోమిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడితే.. ఏపీ అంతు చూస్తామంటూ జీవీఎల్‌ ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు.

అమిత్‌ షా వాహనంపై రాళ్లు పడలేదని డిప్యూటీ సీఎం చినరాజప్ప స్పష్టం చేశారు. అమిత్‌ షా కాన్వాయ్‌లోని వెనుక ఉన్న వాహనాలపైనే రాళ్లు పడ్డాయని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా ఉద్యమం ప్రశాంతంగా కొనసాగాలని టీడీపీ కోరుకుంటుంటే.. బీజేపీ నేతలు మాత్రం రెచ్చగొడుతున్నారని ఆయన సీరియస్‌ అయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడిని టీడీపీ కుట్రగా అభివర్ణించారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు. రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఆయన ఆన్నారు. అమిత్‌ షాపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.తిరుపతిలో అమిత్‌ షా కాన్వాయ్‌ను అడ్డుకోవడాన్ని సీపీఐ నేత నారాయణ సమర్థించారు. ప్రజా ఉద్యమంలో భాగంగా నిరసనలు తెలపడం సర్వసాధారణమన్నారు.. దాన్ని బీజేపీ నేతలు భూతద్దంలో చూడడం  సరి కాదని నారాయణ అభిప్రాయపడ్డారు.. అమిత్ షా కాన్వాయ్ మీద దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు. హోదా ఉద్యమాలు తెలిపే సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకూడదని ఆదేశించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com