భారీ ఆఫర్ పట్టేసిన చెర్రీ!

- May 12, 2018 , by Maagulf
భారీ ఆఫర్ పట్టేసిన చెర్రీ!

రంగస్థలం సినిమాతో భారీ హిట్ ను అందుకున్న  రామ్ చరణ్ ప్రస్తుతం  బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. మాస్ కంటెంట్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడోనన్న సినీవర్గాల్లో నెలకొంది. ఇదిలావుంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి చేసిన సరైనోడు సినిమా కమర్షియల్ గా మంచి హిట్ ను  సొంతం  చేసుకుంది. ఆ సినిమాను హిందీలో డబ్బింగ్ చేసి ఆన్ లైన్ లో విడుదల చేసిన ఈ సినిమాను సుమారు 16 కోట్ల మంది వీక్షించారు. ఈ క్రమంలో తాజాగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా హిందీ హక్కులను దాదాపు  రూ.21 కోట్లకు కొనుకున్నట్టు ఫిలింనగర్లో వార్త హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com