దుబాయ్ లో ఫేక్ క్యాష్ ప్రైజ్ రాకెట్: 14 మంది అరెస్ట్
- May 12, 2018
దుబాయ్:దుబాయ్ పోలీసులు 14 మంది సభ్యులుగల ఓ ముఠాని అరెస్ట్ చేశారు. ప్రముఖ స్టోర్స్ పేరుతో మెసేజ్‌లు పంపి, బహుమతులు గెలిచారంటూ అమాయకుల్ని నమ్మించి, మోసానికి పాల్పడుతున్నట్లు ముఠా సభ్యులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ముఠా గురించిన సమాచారం అందుకున్న యాంటీ ఎకనమిక్ క్రైమ్స్ టీమ్, ఏప్రిల్ 30న రంగంలోకి దిగింది. హోర్ అల్ అన్జ్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి, ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసింది. వీరి నుంచి 90 ఫోన్లు, పెద్ద మొత్తంలో నగదు, ఇల్లీగల్ లోకల్ కాలింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యాంటీ ఎకనమిక్ క్రైమ్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ ఒమర్ బిన్ హమ్మాద్ మాట్లాడుతూ, నిందితులంతా విజిట్ వీసాపై దేశంలోకి వచ్చారనీ, ఓ వ్యక్తి అరబిక్ స్పష్టంగా మాట్లాడతాడనీ, అతడే మాస్టర్ మైండ్ అనీ చెప్పారు. ఫేక్ క్యాష్ ప్రైజ్ పేరుతో జరిగే అక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని కల్నల్ ఒమర్ బిన్ మహ్మద్ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..