సౌదీ అరేబియా:అరబిక్ ఐమ్యాక్స్ సినిమాలకై ఒప్పందం
- May 12, 2018
సౌదీ అరేబియా:ఐమ్యాక్స్ కార్పొరేషన్, సౌదీ అరేబియాకి చెందిన జనరల్ కల్చర్ అథారిటీ (జిసిఎ) ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి. స్థానిక ఐమ్యాక్స్ ఫార్మాట్ సినిమాలకు సంబంధించి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి అత్యంత కీలకమైన ముందడుగుగా ఈ ఒప్పందాన్ని అభివర్ణిస్తున్నారు నిపుణులు. జిసిఎ, ఐమ్యాక్స్ సంయుక్తంగా సౌదీ స్టూడియోస్ మరియు డైరెక్టర్స్‌కి సాయం అందించడం, అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న ఐమ్యాక్స్ ప్లాట్‌ఫామ్స్‌పై వాటిని ప్రదర్శించేలా సహకరించడం వంటివి ఈ ఒప్పందంలో బాగంగా ఉన్నాయి. చైనా, ఇండియాల్లో విజయవంతంగా ఐమ్యాక్స్ తన కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఏప్రిల్ 30న ఐమ్యాక్స్ తన తొలి కమర్షియల్ మల్టీప్లెక్స్ థియేటర్ని విఓఎక్స్ సినిమాస్‌తో కలిసి రియాద్‌లో ప్రారంభించింది. రానున్న కొన్నేళ్ళలోనే 15 నుంచి 20 వరకు ఐమ్యాక్స్ థియేటర్స్‌ని సైదీ అరేబియాలో నిర్మించబోతోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







