సౌదీ అరేబియా:అరబిక్‌ ఐమ్యాక్స్‌ సినిమాలకై ఒప్పందం

- May 12, 2018 , by Maagulf
సౌదీ అరేబియా:అరబిక్‌ ఐమ్యాక్స్‌ సినిమాలకై ఒప్పందం

సౌదీ అరేబియా:ఐమ్యాక్స్‌ కార్పొరేషన్‌, సౌదీ అరేబియాకి చెందిన జనరల్‌ కల్చర్‌ అథారిటీ (జిసిఎ) ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి. స్థానిక ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ సినిమాలకు సంబంధించి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి అత్యంత కీలకమైన ముందడుగుగా ఈ ఒప్పందాన్ని అభివర్ణిస్తున్నారు నిపుణులు. జిసిఎ, ఐమ్యాక్స్‌ సంయుక్తంగా సౌదీ స్టూడియోస్‌ మరియు డైరెక్టర్స్‌కి సాయం అందించడం, అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న ఐమ్యాక్స్‌ ప్లాట్‌ఫామ్స్‌పై వాటిని ప్రదర్శించేలా సహకరించడం వంటివి ఈ ఒప్పందంలో బాగంగా ఉన్నాయి. చైనా, ఇండియాల్లో విజయవంతంగా ఐమ్యాక్స్‌ తన కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 30న ఐమ్యాక్స్‌ తన తొలి కమర్షియల్‌ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ని విఓఎక్స్‌ సినిమాస్‌తో కలిసి రియాద్‌లో ప్రారంభించింది. రానున్న కొన్నేళ్ళలోనే 15 నుంచి 20 వరకు ఐమ్యాక్స్‌ థియేటర్స్‌ని సైదీ అరేబియాలో నిర్మించబోతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com