దుబాయ్‌:తగలబడ్తున్న కారు నుంచి వ్యక్తిని రక్షించిన హీరో కాప్‌

- May 12, 2018 , by Maagulf
దుబాయ్‌:తగలబడ్తున్న కారు నుంచి వ్యక్తిని రక్షించిన హీరో కాప్‌

దుబాయ్‌:దుబాయ్‌ హైవేపై ఓ కారు తగలబడ్తుండగా, అందులోంచి ఓ వ్యక్తిని కాపాడి 'హీరో' అన్పించుకున్నారు ఓ కాప్‌. సర్జంట్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ మహఫౌజ్‌, ఇంటికి వెళుతున్న సమయంలో తగలబడ్తున్న కారు కన్పించింది. షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ రెస్క్యూ విభాగంలో డిఫికల్ట్‌ టాస్క్స్‌ టీమ్‌లో సర్జంట్‌ మొహమ్మద్‌ విధులు నిర్వహిస్తున్నారు. తగలబడ్తున్న కారుని చూసిన వెంటనే, ఆ కారు అద్దాల్ని పగలగొట్టేందుకు, కారు తలుపు తీసేందుకు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాలేదు. ఈలోగా అటువైపుగా ఓ వాటర్‌ ట్యాంకర్‌ రావడంతో, ఆ నీటి సాయంతో కారులో మంటల్ని ఆర్పివేశారు. స్థానికుల సాయంతో కారులోంచి ఆ వ్యక్తిని బయటకు తీశారు సార్జంట్‌ మొహమ్మద్‌. ప్రాణాలకు తెగించి ఓ వ్యక్తిని రక్షించినందుకుగాను సార్జంట్‌ మొహ్మద్‌ని హీరో కాప్‌గా అభివర్ణిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com