నవాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలతో రెండు దేశాల్లో రాజకీయ దుమారం

- May 12, 2018 , by Maagulf
నవాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలతో రెండు దేశాల్లో రాజకీయ దుమారం

ముంబై మారణకాండలో పాకిస్థాన్‌ ప్రమేయం ఉందని ప్రకటించి సంచలనం రేపారు పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌. 2008 నవంబరు 26న ముంబైకి వెళ్లినది పాకిస్థానీ ఉగ్రవాదులేనని డాన్‌ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొనడం రెండు దేశాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. ''ప్రభుత్వాలతో పరోక్ష సంబంధం ఉన్న ఉగ్రవాద తండాలు విశృంఖలంగా చెలరేగి సరిహద్దులు దాటడానికి అనుమతించడం సరైన చర్యేనా? ముంబైలో 150 మందిని ఊచకోత కోసేందుకు సహకరించడం కరెక్టేనా? అందుకే మనం ప్రపంచదేశాల్లో ఏకాకి అయ్యాం. ఈ పరిస్థితి మారాలి'' అని నవాజ్‌ షరీఫ్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com