దుబాయ్:తగలబడ్తున్న కారు నుంచి వ్యక్తిని రక్షించిన హీరో కాప్
- May 12, 2018
దుబాయ్:దుబాయ్ హైవేపై ఓ కారు తగలబడ్తుండగా, అందులోంచి ఓ వ్యక్తిని కాపాడి 'హీరో' అన్పించుకున్నారు ఓ కాప్. సర్జంట్ మొహమ్మద్ అహ్మద్ మహఫౌజ్, ఇంటికి వెళుతున్న సమయంలో తగలబడ్తున్న కారు కన్పించింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రెస్క్యూ విభాగంలో డిఫికల్ట్ టాస్క్స్ టీమ్‌లో సర్జంట్ మొహమ్మద్ విధులు నిర్వహిస్తున్నారు. తగలబడ్తున్న కారుని చూసిన వెంటనే, ఆ కారు అద్దాల్ని పగలగొట్టేందుకు, కారు తలుపు తీసేందుకు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాలేదు. ఈలోగా అటువైపుగా ఓ వాటర్ ట్యాంకర్ రావడంతో, ఆ నీటి సాయంతో కారులో మంటల్ని ఆర్పివేశారు. స్థానికుల సాయంతో కారులోంచి ఆ వ్యక్తిని బయటకు తీశారు సార్జంట్ మొహమ్మద్. ప్రాణాలకు తెగించి ఓ వ్యక్తిని రక్షించినందుకుగాను సార్జంట్ మొహ్మద్ని హీరో కాప్‌గా అభివర్ణిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..