మీకు అప్పులు ఉన్నాయా? అయితే మీకోసమే ఈ చిట్కాలు

- May 12, 2018 , by Maagulf
మీకు అప్పులు ఉన్నాయా? అయితే మీకోసమే ఈ చిట్కాలు

తమ అప్పులను కన్సాలిడేట్ చేసుకునేందుకు ఇప్పుడు అనేక మంది రుణ గ్రహీతలు పీర్-టు-పీర్ వ్యవస్థను ఆశ్రయిస్తున్నారు. హోం రినోవేషన్‌కు అధికంగా రుణాలు తీసుకుంటున్నారని లెన్‌డెన్ క్లబ్ వంటి పీ2పీ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ చెబుతున్నాయి. ఈ తరం యువత ఎక్కువగా రుణాలను చేసేయడం.. ముఖ్యంగా క్రెడిట్ కార్డులను భారీగా ఉపయోగించి వాటి బకాయిలను తీర్చేందుకు రుణాలు చేయడం ఎక్కువగా కనిపిస్తోంది.

పీ2పీ ప్లాట్‌ఫామ్స్‌లో రుణాలు తీసుకుంటున్నవారిలో ఎక్కువగా 25-34 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వారే ఉంటున్నారు. గత రెండేళ్లుగా క్రెడిట్ కార్డ్ బకాయిలు, పర్సనల్ లోన్స్ పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు తెలుపుతున్నాయి.

ఒక వేళ మరీ రుణాల ఊబిలో చిక్కుకుంటే వాటి నుంచి బయట పడేందుకు ఈ మార్గాలను అనుసరించి సత్ఫలితాలను పొందవచ్చు. జీవిత బీమా పాలసీ లేదా వేరే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై రుణాలను తీసుకోండి. వీటిపై వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా ఎగ్జిట్ ఫీజు మాత్రం అధికంగా ఉంటుంది. 9-14 శాతం వడ్డీతోనే రుణాలను పొందవచ్చు.

పర్సనల్ లోన్స్‌పై ప్రస్తుతం 15-22 శాతం వడ్డీ విధిస్తుండగా.. క్రెడిట్ కార్డు బకాయిలపై 48శాతం వరకూ చెల్లించాల్సి వస్తోంది.క్రెడిట్ కార్డ్ బకాయితో పాటు హోమ్ లోన్ లేదా కార్ లోన్ ఉన్నట్లయితే, ఆయా రుణాల కాల వ్యవధిని పొడిగించడం ద్వారా చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. నెలవారీ చెల్లింపు మొత్తాన్ని తగ్గించుకుంటే.. క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించేందుకు మీకు అధికంగా డబ్బు చేతిలో కనిపించే అవకాశం ఉంటుంది.

రుణాలను చెల్లించేటపుడు మొదటగా అధిక వడ్డీ చెల్లించాల్సిన వాటిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అంటే మొదటగా క్రెడిట్ కార్డు బకాయిలు, ఆ తర్వాత పర్సనల్ లోన్స్, కారు రుణాలు.. చివరగా హోమ్ లోన్‌పై దృష్టి పెట్టాలి. క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించేందుకు మినిమం అమౌంట్‌ను చెల్లిస్తే సరిపోతుందనే భావనతో మాత్రం ఉండకండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com