ఇండోనేషియాలో ఆత్మహుతి దాడి
- May 12, 2018
జకార్తా : ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్సులోని సురాబయా నగరంలోని శాంటా మారియా తక్ బెర్సెల చర్చి వద్ద ఆదివారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయాలయ్యాయి. బాధితుల్లో ఒకరు చర్చికి చెందిన సభ్యుడు కాగా, మరొకరు నిందితుడని తూర్పు జావా పోలీస్ అధికార ప్రతినిధి ఫ్రాన్స్ బరుంగ్ మంగేరా తెలిపారు. ఇది ఆత్మహుతి దాడి అని పేర్కొన్నారు. సుమారు మూడు చర్చిల్లో ఇటువంటి దాడులు జరిగాయని తూర్పు జావా పోలీసులు తెలిపారు. మిగతా రెండు చర్చిల్లో మరణాల సంఖ్య తెలియరాలేదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు మొదటి బాంబు పేలుడు జరిగిందని, 10 నిమిషాల్లోనే అన్ని చోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయని తెలిపారు. దీంతో ఆ శాంటా మేరియా టాక్ బెర్సల చర్చి ప్రాంతం చుట్టూ భద్రతా సిబ్బందిని నియమించామని, బాంబు స్వ్కాడ్‌ను కూడా ఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. బాధితులను గుర్తిస్తున్నామని, నాల్గవ చర్చిలో కూడా దాడులు జరిగాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..