పారిస్ లో ఉగ్రదాడి.. ఇద్దరు మృతి

- May 12, 2018 , by Maagulf
పారిస్ లో ఉగ్రదాడి.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌ : పారిస్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి 'అల్లాహు అక్బర్' అని అరుస్తూ దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సెంట్రల్ పారిస్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఉగ్రవాదిని కాల్చిచంపారు.

బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లతో నిండి ఉండే నగరంలోని ఒపేరా హౌస్ ప్రాంతంలో ఉగ్రవాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జనాలు వీకెండ్ నైట్ ఉత్సాహంలో ఉండగా దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫ్రెంచ్ లో మరోమారు రక్తం చిందిందని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాది తమ సైనికుడేనని ఐసిస్ అధికారిక న్యూస్ ఏజెన్సీ అమాఖ్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com