నట కిరిటికి విశిష్ట పురస్కారం.

- May 12, 2018 , by Maagulf
నట కిరిటికి విశిష్ట పురస్కారం.

నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ మరో విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికా స్టేట్‌ ఆఫ్‌ న్యూజెర్సీ, సెనేట్‌ అండ్‌ జెనరల్‌ అసెంబ్లి వారు రాజేంద్రప్రసాద్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు.
దాదాపు 237 చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు మానసిక ఉల్లాసాన్ని రాజేంద్రప్రసాద్‌ అందించారని, నటుడిగా ఆయన కృషికి ఈ గౌరవాన్ని ఇచ్చినట్లు పురస్కార ప్రదాతలు తెలిపారు. ఈ సందర్భన్ని పురస్కరించుకుని కలైకా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సంస్థ రాజేంద్రప్రసాద్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు రేలంగి నరసింహారావు.ఆమెరికా ప్రభుత్వం అందజేసిన పురస్కార ప్రశంసా పత్రాన్ని రాజేంద్రప్రసాద్‌కు అందజేశారు. అనంతరం రేలంగి నరసింహారావు మాట్లాడుతూ..రాజేంద్రప్రసాద్‌ నేనూ కలిసి 35 చిత్రాలు చేశాం. ఆయన చేయని పాత్రంటూ లేదు. ఆయన తన చిత్రాల్లో భిన్నమైన పాత్రలు చేస్తూ మనల్ని నవ్వించారు. అన్నారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.నాకు ఇన్ని మంచి చిత్రాల్లో నటించే అవకాశమిచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుగా నన్ను భరిస్తున్న దర్శకులకు కృతజ్ఞతలు. ఈతరం దర్శకులు, కథానాయకులు నన్ను నటించమని ప్రోత్సహిస్తూ అవకాశాలు ఇస్తున్నారు. ఇలాంటి పురస్కారాలు మరింత ఉత్సాహంగా పనిచేసేలా పనిచేస్తాయి. అన్నారు. 
ఈ కార్యక్రమంలో దర్శకులు నాగ్‌ అశ్విన్‌, సతీష్‌ వేగ్నేశ, రమేష్‌ చెప్పాల, బందరు బాబీ, కాదంబరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com