శంకర్ ప్లానింగ్స్ అన్నీ తారు మారయ్యాయి.
- December 07, 2015
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంతా ఇప్పుడు విషాదంలో ఉన్నారు. చెన్నైని అతలాకుతలం చేస్తున్న వరదలు కారణగా, అభిమాన ప్రేక్షకులతోపాటు సామాన్య జనం సైతం పడరాని ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది హీరోలు ఎంతో కొంత సహాయాన్ని వారి వంతుగా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే నెలలో సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు ఉంది. దీంతో వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎప్పటిలాగే రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రజినీకాంత్ పుట్టినరోజున అభిమానులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇక డిసెంబర్ 14న రానున్న రజనీకాంత్ పుట్టిన రోజు వేడకలకి అభిమానులు హంగామా క్రియేట్ చేయటానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ పుట్టిన రోజున మరొక ప్రత్యేక విశేషం ఏమిటంటే రజనీకాంత్ నటించనున్న అప్ కిమంగ్ ఫిల్మ్ రోబో2.. పూజా కార్యక్రమానాలను జరపుకోబోతుంది. అందుకు శంకర్ సైతం తగిన ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ తాజాగా గత20 రోజులుగా చెన్నైలో కురుస్తున్న భారీగా వర్షాల కారణంగా చెన్నై దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఓ రకంగా చెప్పాలంటే వర్షాల దెబ్బకి చెన్నై నగరమంతా ఓ చెత్తకుప్పలా మారింది. దీని నుండి కోలుకోవాలంటే చెన్నైకి సుమారు నెల రోజులకి పైగానే సమయం పట్టనుంది. ఇక ఆర్ధిక నష్టం అపారమైనదిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రజనీకాంత్ తన పుట్టిన రోజు వేడుకలని జరుపుకోవటం ఏ మాత్రం కరెక్ట్ కాదని భావించాడు. అందుకే రజినీకాంత్ తన అభిమానులకు, కుటుంబ సభ్యులకి పుట్టిన రోజు వేడుకల కోసం ఎటువంటి హడావిడి చేయద్దని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా పుట్టిన రోజు కోసం చేసే ఖర్చును చెన్నై బాధితుల కోసం ఖర్చు చేయాలని పిలుపు ఇచ్చాడు. ఇప్పటికే రజనీకాంత్ అభిమానులు పలు టీంలుగా ఏర్పడి ఇబ్బందిపడుతున్న ప్రజలకి పలురకాలుగా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఇక శంకర్ మాత్రం తన మూవీకి సంబంధించిన ప్రారంభం ముహుర్తంని అదే రోజు చేయాలని పట్టుబడుతున్నాడు. అందుకు రజనీకాంత్ శంకర్ కి గట్టిగా సమాధానం చెప్పాడంట. రోబో2కి సంబంధించిన షూటింగ్ ముహుర్తంని పుట్టిన రోజు నాడు కాకుండా, మరో రోజు జరపాలంటూ శంకర్ కి చెప్పటంతో...శంకర్ ప్లానింగ్స్ అన్నీ తారు మారయ్యాయి. దీంతో షూటింగ్ షెడ్యూల్స్ అంతా ఓ నెల రోజుల పాటు వెనక్కి జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని శంకర్ అంటున్నారు. మొత్తంగా రజనీకాంత్ మాటకు ఎదురు చెప్పలేక శంకర్ సైతం షాక్ అయ్యాడంటూ కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







