బిగ్ బాస్-2 కంటెస్టంట్స్ లిస్ట్.. ఊహలకు కూడా అందని వారిని తీసుకొచ్చారు..!
- May 14, 2018
స్టార్ మా ప్రెస్టిజియస్ గా ప్రొడ్యూస్ చేస్తున్న బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు సిద్ధమవుతుంది. ఈ సీజన్ లో నాని బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించనున్నాడు. నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ఈ రియాలిటీ షో నడుస్తుందట.
ఇక కంటెస్టంట్స్ గా నిత్యం వార్తల్లో ఉన్న వారిని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. వారిలో ఒకప్పుడు లవర్ బోయ్ గా సూపర్ క్రేజ్ ను దక్కించుకున్న తరుణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక క్రేజీ సింగర్ గీతా మాధురి కూడా ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో ఉండనుందట. అంతేకాదు యాంకర్ శ్యామలా, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి కూడా బిగ్ బాస్ సీజన్ 2లో పాటిస్పేట్ చేస్తున్నారట.
వీరితో పాటు గజాలా, తేజశ్వి మడివాడా కూడా కంటెస్టంట్స్ గా ఉండబోతున్నారట. మొత్తానికి మొదటి సీజన్ లో లాగా కాకుండా సెకండ్ సీజన్ లో క్రేజీ స్టార్స్ బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొంటున్నారు. ఈ లిస్ట్ చూస్తుంటే సీజన్-2 మరింత మజా ఇవ్వనుందని చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ 1 కన్నా ఈ సీజన్ లో రూల్స్ ఇంకా కఠినతరంగా ఉండనున్నాయట.
నాని హోస్ట్ గా రాబోతున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ జూన్ నుండి స్టార్ మాలో ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. మరి మొదటి సీజన్ లాగా ఈ సెకండ్ సీజన్ సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2 షూటింగ్ కు అన్ని సెట్ చేశారని అంటున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







