టీటీడీ 'శుభప్రదం'కు దరఖాస్తుల స్వీకరణ
- May 15, 2018
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూధర్మ పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 7, 8, 9 తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించే శుభప్రదం కార్యక్రమానికి దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరిస్తారు. 'శుభప్రదం' శిక్షణ శిబిరంలో మానవీయ విలువలు, నైతికాంశాలు, వ్యక్తిత్వ వికాసం, సనాతన ధార్మిక విషయాలు, యోగా, ధ్యానంతోపాటు పలు విషయాలపై అవగాహన కల్పిస్తారు. దరఖాస్తులు జిల్లాల్లోని హిందూ ధర్మ పరిషత్తు కార్యక్రమ అసిస్టెంట్లు, జిల్లా కేంద్ర కళ్యాణ మండపాల్లో లభిస్తాయని, టీటీడీ వెబ్సైట్ http://www.tirumala.org లో కూడా దరఖాస్తులు పొందవచ్చని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎంపికైన విద్యార్థులు తిరుపతిలో తమకు కేటాయించిన కళాశాలల్లో ఈ నెల 25న పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. తరగతులను ఈ నెల 26 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వివరాలకు 9030850336, 9849386124లో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







