గో ఎయిర్‌ 'క్రిస్మస్‌ సేల్‌' పేరుతో ఆఫర్ల..

- December 07, 2015 , by Maagulf
గో ఎయిర్‌ 'క్రిస్మస్‌ సేల్‌' పేరుతో ఆఫర్ల..

బడ్జెట్‌ క్యారియర్‌గా పేరొందిన విమానయాన సంస్థ గో ఎయిర్‌ రానున్న క్రిస్మస్‌ పండగ సీజన్‌ సందర్భంగా 'క్రిస్మస్‌ సేల్‌' పేరుతో ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌ మంగళవారం వరకు అందుబాటులో ఉంటుంది. సేల్‌ సందర్భంగా టిక్కెట్లు కొనుక్కున్న వారు 2016, సెప్టెంబరు 30వ తేదీలోపు ప్రయాణించవచ్చు. బుకింగ్‌లు చేసుకునే వారిలో ప్రతి 25వ కొనుగోలుదారుడూ ఉచిత విమాన టిక్కెట్లను గెలుచుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తున్న విమాన యానసంస్థల్లో గో ఎయిర్‌ ఒకటి. ఈ సంస్థ గత నెలలో మూడు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వాటిలో టిక్కెట్‌ ప్రారంభ ధర రూ.691గా ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com