భేషైన దేశం " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ "
- May 17, 2018
ప్రపంచ దేశాలలో కల్లా 50 శాతం భూగర్భ ఖనిజ సంపదలలో అతి ముఖ్యమైన "ఆయిల్ " నిల్వలలను గణనీయం గా కలిగిన గల్ఫ్ దేశాలలో ఒకటి " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ "
ఈ దేశం యొక్క ప్రాంతీయ / ప్రాచీన నామం ఏమిటంటే " అల్ ఇమరాత్ అల్ అరేబియా అల్ ముతైదాహ్ ".
మధ్య ఆసియా దేశాలలో అత్యంత వేగవంతమైన, గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంటున్న దేశాలలో ప్రధానమైన దేశం ఇది. అరేబియన్ పెన్సిలూ కు తూర్పున ఉండి పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతం గా ప్రక్కన సౌదీ అరేబియా , ఉత్తరాన కతార్ , తూర్పున ఒమన్ దేశాన్ని సరిహద్దులు గా కలిగి సముద్ర వాణిజ్యానికి ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న దేశం " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ " స్వతంత్రం గా పరిపాలన కొనసాగిస్తున్న 7 దేశాలు అనగా అబుదాబీ , దుబాయ్ , షార్జా , ఫుజైరా , రస్ అల్ ఖైమా , అజ్మాన్ మరియు ఉమ్ అల్ ఖ్వైన్ కలిసి 1971 వ సంవత్సరం లో ఒక సంయుక్త ప్రాంతం గా కలిసి " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ " గా ఏర్పడి అబుదాబీ ప్రధాన రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగిస్తున్నాయి.
ఇక్కడ ప్రధానమైన భాష " అరబిక్ " అయినప్పటికీ ఆంగ్లం, హిందీ , ఉర్ధూ భాషలు కూడా వాడుక లో ఉన్నాయి. " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ " లో మొత్తం జనాభా లో స్వదేశీయులు 19 శాతం కాగా మిగిలిన అరబ్ దేశాలకు చెందిన వారు 23 శాతం మంది దాకా ఉన్నారు. వీరితో పాటు 8 శాతం యూరోపియన్ దేశాలకు చెందినవారూ ఉన్నారు. మిగిలిన 50 శాతం మంది దక్షిణ ఆసియా కు చెందిన వారే . వారిలో భారత దేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ కు చెందినవారు.
ఇస్లాం ప్రధానమైన మతం అయినప్పటికీ , పాలకుల దూరదృష్టి , విజ్ఞత కారణం గా ఇతరమతాలకు చెందిన ఆచార వ్యవహారాలు నిర్వహణ లో ఉన్నాయి.
సుమారు 85 శాతం అక్షరాస్యతను కలిగి పారిశ్రామికం గా అభివృద్ధి చెందుతూ , పర్యాటక రంగం లో కీలకమైన నిర్మాణాత్మకమైన విప్లవాలకు శ్రీకారం చుట్టి అంతర్జాతీయం గా విశేష గుర్తింపు కలిగింది " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ "
మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఈ దేశం యొక్క ప్రణాళిక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉదాహరణ గా నిలుస్తుందనడం లో సంశయమే లేదు.
విశాలమైన రహదారులు , ఎడారి ప్రాంతమైనప్పటికీ పచ్చదనానికి ఇస్తున్న ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ రకరకాల పూల మొక్కలు , విశాలమైన ఉద్యానవనములు, పొడవైన మరియు పరిశుభ్రమైన సముద్ర తీరాలు , అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన నిర్మాణాలు ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది ఈ దేశం గురించి.
అంతర్జాతీయ గుర్తింపు పొందిన నిర్మాణాలు బుర్జ్ ఖలీఫా ( అత్యంత ఎత్తైన నిర్మాణం ) , దుబాయ్ మాల్ ( అత్యంత విశాలమైన వర్తక , వాణిజ్య ప్రాంగణం ) , ఫెరారీ వరల్డ్ ( అత్యంత విశాలమైన మోటార్ వెహికల్ ప్రదర్శనా ప్రాంగణం ), ది వరల్డ్ ( ప్రపంచ దేశాల నమూనాలతో కూడిన ద్వీపాల సముదాయం ), పామ్ జూమేరా ( ప్రపంచం లో కెల్లా అతిపెద్ద మానవ నిర్మిత సముద్ర తీర నివాస సముదాయ ప్రాంగణం ) స్కై దుబాయ్ ( మానవ నిర్మిత మంచుకొండలు) , అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ఇలా ఒకటేమిటి అన్నీ ఒకదానికొకటి పోటీ పడుతూ పర్యాటకులను అబ్బురపరుస్తూ ఉంటాయి.
ప్రపంచం లోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించిన దేశం ఇది .ఇక్కడకు ఏటా సుమారు 8 కోట్ల పై చిలుకు పర్యాటకులు విచ్చేస్తుంటారని అంచనా. పర్యాటకులకు సమర్ధవంతమైన సర్వీసులు అందించే ఇక్కడి ప్రభుత్వం ఎపపటికప్పుడు నిత్యనూతనం గా చర్యలు చేబడుతుంది . ఈ ప్రయత్నం లో భాగం గా విశాలమైన హోటల్స్ విడిది కేంద్రాలు గా మిక్కిలి నిర్మించబడ్డాయి.
ఇక విద్య , వైద్య రంగాలలోకి వస్తే అధునాతన భోధన తో పాటు ఆయా దేశాల విద్యావిధానాలు కూడా అందుబాటులో వున్నాయి. విద్యారంగం లో ఎటువంటి లోటుపాట్లకు తావు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు సంస్థాగతం గా సమీక్షలు నిర్వహిస్తుంటాయి. వైద్య రంగానికి వొచ్చేసరికి ప్రతీఒక్కక్కరి ఆరోగ్య భద్రతకు విశేష ప్రాధాన్యత ఇస్తూ అత్యున్నత ప్రమాణాలు కలిగి రోగులకు సేవలందిస్తుంటాయి ఇక్కడి వైద్యశాలలు. ఇక్కడి ప్రభుత్వ వైద్యశాలలు కార్పొరేట్ తరహా ఉంటాయనడం లో అతిశయోక్తి లేదు.
అలాగే శాంతిభద్రత ల నిర్వహణలో ఈ దేశాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ఎటువంటి ఒత్తిడులు , లాలూచీలు మచ్చుకైనా కనబడక న్యాయస్థానాలు ప్రజలకు సురక్షిత జీవన విధానానికి దోహదం చేస్తున్నాయి.
మరో విశేషమేమిటంటే డిజిటల్ మనీ ఎక్కువగా చెల్లుబాటు ఉండే దేశాలలో ఈ దేశానికి పెద్ద పీట వేయచ్చు. ప్రజల యొక్క 99 శాతం డబ్బు బ్యాంకులలోనే ఉంటుందంటే నమ్ముతారా ? ఇక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత సమర్ధవంతం గా పనిచేస్తుంది . అందుకే ప్రజలకు డబ్బు కొరత కనబడదు.
వివిధ వృత్తి వ్యాపకాలలో తలమునకలుగా వుండే వారందరికీ ఆహ్లాదపరుస్తూ వారంతంపు సెలవులైన శుక్ర, శని వారాలలో మంచి మంచి కార్యక్రమాలు అంగరంగ వైభవం గా నిర్వహిస్తూ ఉంటారు. మీకు ఈ దేశం లో ఎక్కడ చూసినా భిన్నత్వం లో ఏకత్వం పరిపూర్ణం గా ప్రస్ఫూట మవుతుంది.
ఆఖరుగా " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ " ఒక సురక్షిత దేశం. పేరుకే రాజరిక వ్యవస్థ అయినా పాలకులు ప్రజలతో నిత్యం మమేకమై ఉండడం చేత ఒక లౌకిక రాజ్యం గా పేర్కొనవచ్చు. మరో విశేషమేమిటంటే ఇక్కడ రాజైనా , సాధారణ పౌరుడు అయినా వ్యవస్థ సరిసమానం గా చూస్తుంది. ఎక్కడా మనకు వి ఐ పి ల తాకిడి కనబడదు. అలాగే రహదారుల దిగ్భంధన లూ కనబడవు.
మొత్తం గా భేషైన దేశం " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ " .
కేవలం 46 సంవత్సారాల లో నే ఇంత గణనీయ అభివృద్ధి సాధించిన దేశం ఎన్నో దేశాలకు ఆదర్శం గా నిలవాలని ఆశిస్తూ..
యు.ఎ.ఇ నివాసి మరియు ప్రవాస భారతీయుడు
సుబ్రహ్మణ్య శర్మ
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..