వివాదాస్పద సినిమా ఫస్ట్‌లుక్ విడుదల!
- May 17, 2018
ప్రముఖ రచయిత ఇస్మై చుగ్తాయి రచించిన పుస్తకం 'లిహాఫ్' దాని ఆధారంగా రూపొందుతున్న వివాదాస్పద చిత్రం 'లిహాఫ్'(మెత్తని బొంత). రహత్ కాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. కేన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ ప్రాంగణంలో లిహాఫ్ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఒక ఎర్రని బొంత మీద ఇద్దరు మహిళల పాదాలు ఒకదాని మీద మరొకటి. వాటిలో ఒకరి పాదాలకు బాగా అలకంరించిన మువ్వలు ఉండగా, మరొకరి పాదాలకు సాదా మువ్వలు కనిపిస్తున్నాయి. భర్త నిరాదరణకు గురైన మహిళ మానసిక సరిస్థితి ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఆమెను ఏఏ విషయాలు ఆకర్షిస్తాయనే ఇతివృత్తంతో తెరకెక్కుతుంది 'లిహాఫ్'.. ఇందులో తనిష్తా ఛటర్జీ , సోనల్ సెహగల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







