స్నేహితుడి హత్య కేసులో నిందితుడికి ట్రయల్‌

- May 18, 2018 , by Maagulf
స్నేహితుడి హత్య కేసులో నిందితుడికి ట్రయల్‌

ఎమిరేటీ వ్యక్తి ఒకరు, తన స్నేహితుడిపైకి కారుని నడిపి, అతని మరణానికి కారణమయిన కేసులో విచారణ జరుగుతోంది. చిన్న పాటి గొడవ ఈ ఘటనకు కారణంగా పోలీసులు పేర్కొన్నారు. క్రిమినల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌లో ఈ కేసు విచారణకు వచ్చింది. పాకిస్తానీ జాతీయుడొకరు, ఎమిరేటీ స్నేహితుడితో కలిసి డిజర్ట్‌లో క్యాంపింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి ఈ క్యాంప్‌ని ప్లాన్‌ చేసుకున్నారు.అయితే చిన్న గొడవ కారణంగా ఇద్దరి మధ్యా తోపులాట జరిగింది. పాకిస్తానీ వ్యక్తి, ఎమిరేటీ వ్యక్తిపై దాడి చేశాడు. టెంట్‌లోని మరో వ్యక్తి ఈ ఇద్దరి మధ్యా గొడవని సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే నిందితుడు కారుతో, ఆ టెంట్‌లోకి దూసుకెళ్ళి ఓ స్నేహితుడి మృతికి కారణమయ్యాడు. అయితే విచారణలో తాను చేసిన నేరాన్ని అంగీకరిస్తూనే, ఉద్దేశ్యపూర్వకంగా ఆ పని చేయలేదని చెప్పాడు నిందితుడు. నిందితుడి తరఫు లాయర్‌ తన క్లయింట్‌పై ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య ఆరోపణల్ని ఉపసంహరించుకోవాలని వాదనలు విన్పించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com