బిగ్ బాస్ హోస్ట్ గా 'నాని' కంఫర్మ్!
- May 18, 2018గతేడాది తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 2017లో ప్రసారమైన అతిపెద్ద తెలుగు టీవీ షో లలో ఒకటిగా బిగ్ బాస్ నిలిచింది. దీనికి కారణం యుంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడమే అనే అభిప్రాయముంది.. బిజీ షెడ్యూల్ కారణంగా ఎన్టీఆర్ ఈ షో నుంచి బయటకు వెళ్తున్నాడు. దీంతో అయన స్థానంలో నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ 2 కు హోస్ట్ గా ఫిక్స్ అయినట్టు సమాచారం.మొదటి సీజన్ లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం.. అది సూపర్ హిట్ కావడంతో మళ్ళీ ఎన్టీఆరే సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తారని అనుకున్నారు.. కానీ సినిమాలతో బిజీగా ఉండడంతో బిగ్ బాస్ 2 నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నాడు. ఇక అయన స్థానంలో మరో హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచించగా పలువురు పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరగా నాని ఆ ఛాన్స్ కొట్టేశాడు. దీంతో ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ 2 తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించనున్నాడు నాని.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!