హైదరాబాద్:డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సులో ఉచిత శిక్షణ
- May 18, 2018
హైదరాబాద్:నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణతోపాటు ఉపాధిని కల్పించే లక్ష్యంగా ఉపాధి శిక్షణ శాఖ నిరంతరం కృషి చేస్తుందని శాంతినగర్ ఐటీఐ ప్రిన్సిపల్ పసుపులేటి శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద నిరుద్యోగ యువతీయువకులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సులో ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కోర్సులో శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులన్నారు. ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు వయసు పరిమితి లేదన్నారు. జూన్ 1వ తేదీ నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి అర్హతగల వారు ఈ నెలాఖరులోపు మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లోని శాంతినగర్ ప్రభుత్వ ఐటీఐలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మరింత సమాచారం కోసం 9440068152 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







