బెడిసికొట్టిన యడ్యూరప్ప వ్యూహాలు

- May 19, 2018 , by Maagulf
బెడిసికొట్టిన యడ్యూరప్ప వ్యూహాలు

     

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. మెజార్టీ లేకపోవడంతో యడ్డీ దిగక తప్పలేదు. మోడీ, అమిత్ షాలు వ్యూహాలు పన్నినా అవి విఫలమయ్యాయి. మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు పాకులాడారు. చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బలనిరూపణ జరిగితే భంగపాటు తప్పదని భయపడడంతో గౌరవంగా రాజీనామా చేయడానికే మొగ్గు చూపారు. మెజార్టీ రాకున్నా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. అయినా యడ్యూరప్ప సీఎం అయిన ప్రతీసారీ వివాదాలే! ఎమ్మెల్యేలతో బీజేపీ రాయబారాలు బెడిసికొట్టాయి. ఎమ్మెల్యేల బేరసారాల టేపులను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆడియో టేపుల విడుదలతో బీజేపీలో కలకలం రేగింది. దేశవ్యాప్తంగా పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని భయపడింది. 

పార్టీకి అప్రదిష్ట తేవద్దంటూ అధిష్టానం ఆదేశించింది. వైరిపక్షాల ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించిందంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా సంఖ్యాబలంపై మొదటి నుంచి బీజేపీలో ఆందోళన నెలకొంది. అమిత్ షా స్కెచ్ లు ఘోరంగా విఫలమయ్యాయి. ఇటు యడ్యూరప్ప.. ముహూర్తం చూసి మరీ ప్రమాణం చేసినా ఫలితం లేకపోయింది. కర్ణాటక ఫలితాలను కలలో కూడా బీజేపీ ఊహించలేదు. దీంతో దక్షిణాదిన ఇప్పట్లో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com