బ్యాంకాక్‌లో 'ఐఫా - 2018' వేడుకలు.!

- May 19, 2018 , by Maagulf
బ్యాంకాక్‌లో 'ఐఫా - 2018' వేడుకలు.!

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమి అవార్డ్స్‌ (ఐఐఎఫ్‌ఏ) వేడుకలు బాలీవుడ్‌ సినిమా ఇండిస్టీ ఈ ఏడాది బ్యాంకాక్‌లో నిర్వహించనుంది. ఆ వేడుకలకు సంబంధించిన ప్రోమోను ఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కరణ్‌ జోహార్‌, సాహిద్‌ కపూర్‌, రణబీర్‌ కపూర్‌, కార్తిక ఆర్యాన్‌, దియా మిర్జా ఐఫా వేడుకల వివరాలను వెల్లడించారు. ఈనెల 22 నుంచి 24 వరకూ బ్యాంకాక్‌లో ఈ వేడుక ఉంటుందని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది అత్యంత గ్రాండ్‌ చేసేందుకు సన్నాహాలు చేశామని కరణ్‌ జోహార్‌ తెలిపారు. ఈ ఆ మూడు రోజులు చిత్రసీమకు హాలీడే అని ప్రకటించారు. నటీనటులంతా ఈ వేడుకలో పాల్గొంటారని అన్నారు. ఈ ఐఫా ప్రయాణం తనకొక జ్ఞాపకం అని కరణ్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com