ఘనంగా హ్యారీ, మెర్కెల్ వివాహం.!
- May 19, 2018
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మెర్కెల్ వివాహం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. విండ్సర్ రాజభవనంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వివాహానికి బ్రిటన్ రాణి ఎలిజబెత్-2తో పాటు ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్‌తో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. వివాహ వేడుక సందర్భంగా ప్రిన్స్ హ్యారీని ఇంగ్లాండ్‌లోని ససెక్స్ ప్రాంతానికి డ్యూక్‌గా క్వీన్ ఎలిజబెత్-2 ప్రకటించారు.
వివాహ వేడుక అనంతరం నూతన దంపతులు ఊరేగింపుగా వెళ్లారు. రహదారులకు ఇరువైపులా నిలబడిన బ్రిటన్ వాసులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. పలువురు భారతీయులకు ఈ వివాహ వేడుక ఆహ్వానం అందింది. వీరి పెళ్లికి ముంబయిలోని డబ్బావాలాలు తలపాగా(ప్రిన్స్ హ్యారీ కోసం), చీర, గాజులు(మేఘన్ మెర్కెల్)కు బహుమతిగా పంపించారు. ఈ నూతన దంపతులు కెన్‌సింగ్టన్ ప్యాలెస్‌లోని నాట్టింగామ్ కాటేజ్‌లో తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ నివసిస్తున్న పక్కనే కొత్త దంపతులు ఉండనున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







