జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శ్రీకాకుళంలో పర్యటన

- May 20, 2018 , by Maagulf
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శ్రీకాకుళంలో పర్యటన

శ్రీకాకుళం:సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కవిటి మండలం కపాసుకుద్దికి చేరుకున్న పవన్‌కు మత్స్యకారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం పవన్‌ సముద్రతీర ప్రాంతంలో మత్స్యకారులతో కలిసి గంగామాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..మిగతా రాజకీయపార్టీలు, జనసేనకు తేడా ఉంది. నేను హామీలు ఇవ్వటానికి ఇక్కడికి రాలేదన్నారు. జనసేన మీ ముందుకు వచ్చింది. ఓట్లు అడగటానికి కాదు. ఉద్దానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఉద్దానం సమస్యపై కదలిక మొదలైంది కానీ..అసంపూర్తిగా మిగిలిపోయింది. శ్రీకాకుళంలో వలసలు నియంత్రించే బాధ్యత తీసుకుంటాం. ప్రజల సమస్యలపై అవగాహన కోసమే జనసేన పోరాట యాత్ర. శ్రీకాకుళం దేశభక్తికి..కష్టానికి ప్రతీక. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే..ముందు ప్రజల కష్టాలు తెలియాలి. పెద్దల ఆశీస్సులు, యువత మద్దతు, అక్కాచెల్లెళ్ల తోడుతో ప్రభుత్వ ఏర్పాటు ఖాయం. నేను ప్రకృతిని పూజించేవాడిని.

జనసేన పార్టీ మన సంస్కతిని పరిరక్షించే పార్టీ అని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com