అమ్మలు వేరైనా నాన్న ఒక్కరే.. మేమంతా కూడా ఒక్కటే

- May 21, 2018 , by Maagulf
అమ్మలు వేరైనా నాన్న ఒక్కరే.. మేమంతా కూడా ఒక్కటే

నటుడు జెమినీ గణేశన్‌‌కి నలుగురు భార్యలు. ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మహానటి సావిత్రి సినిమాతో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కథ సావిత్రిది కావడంతో ముందునుంచి తెరపైకి వచ్చింది ఆమె కుమార్తె చాముండేశ్వరి, కొడుకు సతీష్‌లు మాత్రమే. అయితే అనూహ్యంగా తెరపైకి వచ్చి సినిమాలో నాన్నకి చెడుగా చూపించే ప్రయత్నం చేశారు. మానాన్న చాలా మంచి వారు అంటూ జెమినీ మొదటి భార్య ఆలిమేలు కూతురు చెన్నైకు చెందిన డాక్టర్ కమలా సెల్వరాజ్ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అమ్మలు వేరైనా మేమంతా కలుస్తుంటాము. అందరి మధ్యా మంచి సంబంధాలే ఉన్నాయిని వివరించింది. మా నాన్న జెమినీ మమల్మి అందర్నీ ఒకేలా పెంచారని గర్వంగా చెప్పుకుంది. వివిధ సందర్భాలు, వేడుకల్లో అక్కచెల్లెళ్లమంతా కలుస్తుంటామని తెలిపింది. అలాంటి వేడుకే ఒకటి శుక్రవారం చెన్నైలో జరిగింది. అక్కడ ఈ అక్క చెల్లెళ్లంతా ఒరినొకరు ప్రేమాభిమానాలతో పలకరించుకోవడం అతిధుల్ని ఆశ్చర్యపరిచింది. కాగా మొదటి భార్య అలిమేలు కుమార్తెలు డాక్టర్ జయ శ్రీధర్, డాక్టర్ రేవతి స్వామినాధన్, డాక్టర్ కమలా సెల్వరాజ్, నారాయణి గణేశన్‌లు. ఇక రెండో భార్య పుష్పవల్లి కుమార్తెలు బాలీవుడ్ నటి రేఖ, రాధా సయ్యద్‌లు. మూడో భార్య తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత, అందాల అభినేత్రి మహానటి సావిత్రి పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్‌లు. ఇప్పుడు వీరంతా ఒకే వేదిరపై ఉండడం అభిమానులకు కన్నుల పండువగా ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com