మళ్ళీ భయపెట్టనున్న అంజలీ

- May 21, 2018 , by Maagulf
మళ్ళీ భయపెట్టనున్న అంజలీ

గీతాంజలి మూవీతో అందర్ని భయపెట్టిన అంజలి మరోసారి అదే జోనర్ లో ఒక మూవీ చేయనుంది..తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాకి 'లిసా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రెండు భాషల్లోను ఆమెకి మంచి క్రేజ్ వుంది. అంతే కాకుండా గతంలో ఆమె చేసిన 'గీతాంజలి' వంటి హారర్ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. త్రీడీ హారర్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ద్వారా రాజు విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com