రస్ అల్ ఖైమాలో యాంటీ బెగ్గింగ్ క్యాంపెయిన్
- May 22, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా పోలీస్, యాంటీ బెగ్గింగ్ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. పవిత్ర రమదాన్ మాసంలో వివిధ దేశాలకు చెందిన కొందరు బెగ్గింగ్‌ని లాభసాటి వృత్తిగా మారుచకుంటారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. రస్ అల్ ఖైమా పోలీసులు 2016 రమదాన్‌లో 30 మంది బెగ్గర్స్‌ని అరెస్ట్ చేశారు. 2017లో ఈ సంఖ్య 7. లా నెంబర్ 10 ప్రకారం బెగ్గింగ్ అనేది నేరం. మూడు నెలల వరకు ఈ నేరానికి జైలు శిక్ష తప్పదు. అలాగే 3,000 దిర్హామ్‌ల వరకు జరీమానా కూడా విధిస్తారు. విదేశీయులు బెగ్గర్స్‌గా మారితే, వారికి జరీమానా, జైలు శిక్షతోపాటుగా దేశ బహిష్కరణ కూడా వుంటుంది. బెగ్గర్స్ పట్ల సింపతీ ప్రదర్శించరాదనీ, పేదల్ని ఆదుకోవడానికి ఛారిటీ సంస్థలు పనిచేస్తున్నాయని, వాటికి సహకరించాలనీ పౌరులకు, నివాసితులకు రస్ అల్ ఖైమా పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..