58 వ ఏట అడుగుపెట్టిన మోహన్ లాల్
- May 23, 2018
మలయాళం సూపర్‌స్టార్, 'జనతా గ్యారేజ్' నటుడు మోహన్‌లాల్ ఇటీవలే 58 వ ఏట అడుగుపెట్టారు. 1960 మే 21న కేరళలోని ఎల్నాథూర్‌లో జన్మించిన మోహన్‌లాల్ పూర్తిపేరు మోహన్‌లాల్ విశ్వనాథ్ నాయర్. 1960లో 'మంజిల్ విరింజా పూక్కల్' అనే మలయాళ చిత్రంతో సినీరంగంలో కాలుమోపారు. మోహన్‌లాల్ నటునిగానే కాకుండా ప్రొడ్యూసర్, సింగర్, థియేటర్ ఆర్టిస్టుగానూ పేరొందారు. మోహన్‌లాల్‌కు ఊటీతోపాటు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. బుర్జ్ ఖలీఫాలోని ఫ్లాట్‌ను రూ. 212 కోట్లు వెచ్చించి మోహన్‌లాల్ కొనుగోలు చేశారు. మోహన్‌లాల్ దగ్గర రూ. 7.5 కోట్ల విలువైన లగ్జరీ కార్లున్నాయి. అలాగే ఫిలిం ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలతో పాటు రెస్టారెంట్, మసాలా ప్యాకేజింగ్ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. మోహన్‌లాల్ కు ఒక కుమారుడు. ఒక కుమార్తె ఉన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







