ముగ్గురు వలసదారులపై ఫ్రాడ్ అభియోగాలు
- May 23, 2018
మస్కట్: ముగ్గురు వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఓ పౌరుడ్ని మోసం చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఒమనీ రియాల్స్‌ని డాలర్లలోకి మార్చడం ద్వారా డబ్బుని డబుల్ చేస్తామంటూ నిందితులు, బాధితుడ్ని మోసగించినట్లు పోలీసులు తెలిపారు. సీబ్ పోలీస్ స్టేషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్రికా జాతీయులైన ముగ్గురు వ్యక్తుల్ని అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేయగలిగింది. బాధితుడు, మోసగాళ్ళకు 12,000 ఒమన్ రియాల్స్ ఇచ్చాడు. దానికి ప్రతిగా, ఓ బాక్స్‌ని నిందితులు, బాధితుడికి ఇచ్చారు. అందులో డాలర్లు వున్నాయని నమ్మబలికారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్ళిపోగా, బాక్స్ తెరిచిన బాధితుడికి అందులో నల్లటి కాగితాలు మాత్రమే కన్పించాయి. అరెస్టయిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







