బ్లూఫిలిమ్స్లో నటించి తప్పు చేశా..శృంగార తార సన్నీలియోన్
- May 26, 2018
శృంగార తార సన్నీలియోన్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆమె అభిమానులను సైతం కదిలించేసింది. ఎంతో పశ్చాత్తాప పడుతూ చేసిన ఆ ట్వీట్ అభిమానుల గుండెలను పిండేసింది. ఆమె తన పాత జీవితం గురించి ఎంతో భావోద్వేగంతో చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాను సెక్స్ సినిమాల్లో నటించడానికి ముందు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు అలా ఉండాలని కోరుకుంటున్నాని... అలాంటి సినిమాల్లో నటించి చాలా తప్పు చేశానని ఆమె పశ్చాత్తాపం వ్యక్తంచేసింది.
సన్నీ ప్రస్తుతం దక్షిణాది సినిమా 'వీరమహాదేవి'లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా, తన జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ 'కరణ్ జిత్ కౌర్- ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్'ని ఆమె చూసింది. ఈ సందర్భంగా సన్నీలియోన్ ట్వీట్ చేస్తూ... ఆ డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదని, తన హృదయం కొన్ని వేలసార్లు బద్దలైందని పేర్కొంది. తాను నీలి చిత్రాల్లో నటించడానికి ముందు ఎలా ఉండేదాన్నో, మళ్లీ అలా కావాలని కోరుకుంటున్నానని తెలిపింది. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదని, తన పాత వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ గుర్తుంటుందని, తాను తప్పు చేశానని పేర్కొంది.
కాగా సన్నీ బాలీవుడ్‌కు రావడానికి ముందు అమెరికాలో వందలాది నీలి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌కు వచ్చే సమయానికి ఆమెపై అదే ముద్ర ఉంది. మొదట్లో ఐటెం సాంగులు చేస్తూ క్రమంగా ప్రధాన పాత్రల్లో నటిస్తూ మంచి నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నీలిచిత్రాల్లో నటించనప్పటికీ ఆమెను మాత్రం తన గతం వేధిస్తున్నట్లుగా తాజా ట్వీట్ బట్టి అర్థమవుతోంది. అందం, అభినయం ఉన్న సన్నీకి మాత్రం గత జీవిత ముద్ర ఇంకా వెంటాడుతూనే ఉంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







