ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్..వైద్య పరీక్షలు...
- May 27, 2018
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన కొత్త జోనల్ విధానంపై మంత్రిమండలిలో తీర్మానం చేయించిన వెంటనే దాని ప్రతిని తీసుకొని స్వయంగా ఢిల్లీ వెళుతున్నారు కేసీఆర్. ప్రధాని మోడీని కలిసి కొత్త జోనల్ విధానం అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పును కోరే తీర్మానాన్ని అందజేస్తారు. రాష్ట్రపతి ద్వారా ఆమోదం ఇప్పించాలని కోరతారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగు అంశాలు, ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు వంటి ఇతర అంశాలపైనా ప్రధానితో కేసీఆర్ చర్చించే వీలుంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కూడా కేసీఆర్ కలవనున్నారు. ప్రధానితో కేసీఆర్ సమావేశం మంగళవారం ఉండే వీలుంది. ఢీల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి దంత వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటారని సమాచారం.
ఇక 15 అంశాల ఎజెండాగా మధ్యాహ్నం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త జోనల్ విధానం, రైతుల జీవిత బీమా పథకాన్ని ఆమోదించనున్నారు. కాళేశ్వరానికి అదనపు కేటాయింపులు, దేవాదుల, తుపాకుల కార్పొరేషన్ ఉత్తర్వులకు కేబినెట్ ఓకే చెప్పనుంది. రైతు సమన్వయ సమితికి 14 పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇవ్వనుంది మంత్రివర్గం. కర్ణాటక ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలన, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







