ఆ నాలుగు దేశాలతో సంబందాలు తెంచుకున్న ఖతార్‌

- May 27, 2018 , by Maagulf
ఆ నాలుగు దేశాలతో సంబందాలు తెంచుకున్న ఖతార్‌

సౌదీ అరేబియా, యునైటెడ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌ దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకుని ఏడాది పూర్తవుతోంది. తాజాగా ఖతార్‌, ఆ నాలుగు దేశాలతో సంబంధాల్ని పూర్తిగా తెంచేసుకునే క్రమంలో ఆయా దేశాల నుంచి ఇంపోర్ట్‌ అయ్యే వస్తువుల్ని విక్రయించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఖతార్‌ ఎకానమీ మినిస్ట్రీ ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేసింది. బ్యాన్‌ చేయబడిన దేశాలకు చెందిన వస్తువుల్ని గుర్తించేందుకోసం ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయి. తీవ్రవాదానికి మద్దతిస్తోందంటూ ఖతార్‌పై గత జూన్‌ 5న సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌ తెగతెంపులు చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కువైట్‌, ఒమన్‌ నుంచి ఇంపోర్ట్‌ రూట్స్‌ని ఏర్పాటు చేసుకుంది ఖతార్‌. అలాగే ఇరాన్‌, టర్కీల నుంచి గూడ్స్‌ని కొనుగోలు చేస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com