'మిస్టర్ మజ్ను' గా కనిపించనున్న అఖిల్!?

- May 27, 2018 , by Maagulf
'మిస్టర్ మజ్ను' గా కనిపించనున్న అఖిల్!?

యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన మూడో సినిమాకి రెడీ అవుతున్నాడు. ' తొలిప్రేమ' తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమాలో నటించనున్నాడు. తొలి షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేస్తున్నారని, అఖిల్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం చైతూ సరసన ' సవ్యసాచి ' సినిమా చేస్తున్న ఈ హీరోయిన్ అప్పుడే రెండో ఛాన్స్ కొట్టేసింది.అఖిల్ కొత్త చిత్రానికి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెల రెండో వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
 
గతంలో నాగార్జున సినిమా ' హలో బ్రదర్ ' టైటిల్ నుంచి ' హలో 'ను, నాగ్ మరో హిట్ మూవీ అయిన ' మజ్ను ' నుంచి ఇదే టైటిల్ ను తీసుకుని అఖిల్ 'మిస్టర్ మజ్ను' చేస్తున్నాడని మేకర్స్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com