వర్మను ముఖం వచ్చేట్టు చివాట్లుపెట్టిన నాగార్జున
- May 28, 2018
కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 25 ఏళ్ల తర్వాత `ఆఫీసర్` సినిమా తెరకెక్కడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో `శివ` అవుతుందని అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రేక్షకుల్లోనూ అదే అంచనాలుండేవి. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఆశలు సన్నగిల్లాయి. మళ్లీ క్రైమ్ కథనే చేస్తున్నాడని..ఇదేం రోధ అంటూ పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్నారు. పాత చితకాయ పచ్చడినే మళ్లీ విస్తరేసి వడ్డిస్తున్నాడని విమర్శలు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.
వర్మ ముఖం మాడిపోయింది!
ఇటీవలే `ఆఫీసర్` ను వర్మ నాగ్ కు స్పెషల్ వేసి చూపించాడుట. ఆ సమయంలో నాగ్, వర్మ ఇద్దరు పక్కనే కూర్చొని చూస్తున్నారుట. 15 నిమిషాల షో అనంతరం నాగ్ సీటు లోంచి పైకి లేచి షార్ట్ ఫిల్మ్ లా తీసావ్. ఇది సినామానా? పావుగంట సీటులో కూర్చోవడం నాకే కష్టంగా ఉంది. ఇక జనాలేం చూస్తారు? అదే నేను నిర్మాత అయితే `ఆఫీసర్` జీవితంలో రిలీజ్ చేసేవాడిని కాదని చెప్పి వెళ్లిపోయారుట. దీంతో వర్మ ముఖం మాడిపోయిందట. చుట్టూ ఉన్న వర్మ అసిస్టెంట్లు ఈ సీన్ చూసి షాకయ్యారుట. నాగార్జునే అంత మాట అన్నారంటే? జనాలు థియేటర్ కు వచ్చి సినిమా చూస్తే ఇంకెన్ని మాటలు అంటారో? అని గుసగుసలాడుకున్నారుట. ఆగుసగుసలు వర్మ చెవిన పడినా పట్టనట్లు కామ్ గా సినిమా చూసి వెళ్లిపోయాడని సమాచారం.
అందుకే వర్మ పరిస్థితి అలా?
వర్మ కొన్నేళ్లుగా క్రైమ్ నే పనిగా పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు. ఆయన మైండ్ కు క్రైమ్ ఆలోచన తప్ప మరోకటి రావడం లేదు. ఆ థాట్ పై ఇప్పటికే చాలా వివమర్శలు కూడా వచ్చాయి. బాలీవుడ్ లో కూడా అదే పంథాలో కొనసాగుతున్నాడు. అక్కడ విమర్శలు మూటగట్టుకున్నాడు. అయినా వర్మ మారలేదు. నా ఇష్టం.నా సినిమా..జనాలు చూస్తారా? చూడరా అన్నది వాళ్లిష్టం. నాకు నచ్చింది. నేను చేసాను అన్నట్లే ఉంటుంది గానీ..కొత్తగా ప్రయత్నిద్దాం అన్న ఆలోచన ఏ కోసాన కనిపించలేదు. మాట్లాడితే హాలీవుడ్ సినిమాలు తోపు..తురుము అని పొగుడుతాడు. మరి అలాంటి థాట్స్ వర్మకు ఎందుకు రానట్లు? ఇప్పటికైనా వర్మ మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. లేదంటే భవిష్యత్ లో అవకాశమే గగనం అవుతుంది. ఇప్పటికే టాలీవుడ్ కు విరోధి అయ్యాడు. ఆయన తో సినిమాలు చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అందుకే `ఆఫీసర్` నిర్మాణ బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నాడు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







