అక్కడ ఆకస్మిక వరదలతో.. అత్యవసర పరిస్థితి..

- May 28, 2018 , by Maagulf
అక్కడ ఆకస్మిక వరదలతో.. అత్యవసర పరిస్థితి..

అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. ఎల్లికాట్‌ సిటీలో భారీగా వర్షాలు కురవడంతో.. ఒక్కసారిగా వరద పోటెత్తింది. రోడ్లపై పార్క్ చేసిన కార్లను ఈడ్చుకెళ్లింది. చాలా ప్రాంతాల్లో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి. గ్రౌండ్‌ ఫ్లోర్ మునిగేలా వరద వచ్చి పడడంతో.. జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

మేరీలాండ్‌లో ఆకస్మిక వరదలతో.. అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కింది అంతస్తుల్లో ఎవరూ ఉండొద్దని... పై అంతస్తుల్లోకి వెళ్లాలంటూ ఆదేశించారు. వరదలు విపరీతంగా ఉన్నప్రాంతాల్లో కొంతమంది భవనాల్లో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com