యూఏఈలో 2018లో తొలి మెర్స్‌ కేసు

- May 28, 2018 , by Maagulf
యూఏఈలో  2018లో తొలి మెర్స్‌ కేసు

కొత్త మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌ సిఓవి) పేషెంట్‌ని యూఏఈలో గుర్తించారు. 2018లో ఇదే తొలి కేసు అని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించింది. బాధితుడు 78 ఏళ్ళ వ్యక్తి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలతో మే 13న ఆసుపత్రిలో చేరాడు బాధితుడు. ఇటీవలే సౌదీ అరేబియాకి వెళ్ళిన బాధితుడికి, యూఏఈలోని గయితిలో ఓ కామెల్‌ ఫామ్‌ కూడా వుంది. ప్రతిరోజూ ఆ ఫామ్‌ని సందర్శిస్తుంటారాయన. ప్రపంచ వ్యాప్తంగా 2,207 మెర్స్‌ సిఓవి కేసులు నమోదు కాగా, అందులో 787 మరనాలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌ 2012 నుంచి ఈ వైరస్‌ మరణాల్ని లెక్కిస్తున్నారు. 2018లో ఇప్పటిదాకా మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. ఒమన్‌, మలేసియా, యూఏఈ నుంచి చెరో కేసు నమోదు కాగా, మిగతా కేసుల్ని సౌదీ అరేబియాలో గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com