పందిపిల్ల పళ్లుతోముతున్నస్టార్ డైరెక్టర్..

- May 29, 2018 , by Maagulf
పందిపిల్ల పళ్లుతోముతున్నస్టార్ డైరెక్టర్..

విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లరితో మొదలైన ఆయన సినీ ప్రయాణం వడుదుడుకులతో సాగుతోంది.. తీసిన అన్ని సినిమాలు హిట్ అవ్వకపోయిన చెప్పుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి.. తాజాగా  'అదుగో' అంటూ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు రవిబాబు..ఈసారి రోటిన్‌కు భిన్నంగా పంది పిల్లను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెట్టి సినిమా తీశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కోసం రవిబాబే అన్నీ తానై చూసుకుంటున్నాడు.కొద్దిరోజులక్రితం వెరైటీ టీజర్‌తో అందరిసి ఆశ్చర్యపరిచిన రవిబాబు.. ఇప్పుడు మరో వీడియోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.ఆ వీడియోలో పందిపిల్లకు పళ్ళుతోముతు వెరైటీ ప్రచారానికి తెరలేపాడు. ఇప్పుడిదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో అభిషేక్, నాభ లు కీలక పాత్రల్లో నటించగా. సొంత నిర్మాణ సంస్థ అయిన ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై 'అదుగో'ను నిర్మిస్తున్నారు రవిబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com