దుబాయ్:ఎకో ఫ్రెండ్లీ వాహనాల కోసం 70 ఫ్రీ పార్కింగ్‌ స్పేసెస్‌

- May 29, 2018 , by Maagulf
దుబాయ్:ఎకో ఫ్రెండ్లీ వాహనాల కోసం 70 ఫ్రీ పార్కింగ్‌ స్పేసెస్‌

దుబాయ్‌:దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, 70 ఫ్రీ పార్కింగ్‌ స్పేసెస్‌ని ఎన్విరాన్‌మెంట్‌ ఫ్రెండ్లీ వెహికిల్స్‌ కోసం కేటాయించింది. 40 పెయిడ్‌ పార్కింగ్‌ జోన్స్‌లో వీటిని ఏర్పాటు చేశారు. దుబాయ్‌ గ్రీన్‌ మొబిలిటీ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. కార్బన్‌ ఎమిషన్స్‌ తగ్గాలంటే ఎకో ఫ్రెండ్లీ వాహనాల వినియోగం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. ఆర్‌టిఎ - ట్రాఫిక్‌ అండ్‌ రోడ్స్‌ ఏజెన్సీ సిఇఓ ఇంజనీర్‌ మైతా బిన్‌ అదాయ్‌ మాట్లాడుతూ, దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లోని 40 పార్కింగ్‌ జోన్స్‌లో 70 ఫ్రీ పార్కింగ్‌ స్పేస్‌లను ఎకో ఫ్రెండ్లీ వాహనాల కోసం కేటాయించినట్లు చెప్పారు. సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్స్‌, ట్రేడ్‌ సెంటర్‌ ఏరియా, బుర్జ్‌ ఖలీఫా, దుబాయ్‌ మెరీనా, జుమైరా స్ట్రీట్‌, షేక్‌ జాయెద్‌ రోడ్‌ తదితర ప్రాంతాలు ఇందులో వున్నాయి. పార్కింగ్‌ స్పేసెస్‌ని గ్రీన్‌ పెయింట్‌ ఫ్రేమ్స్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్లాట్స్‌ కేవలం ఎకో ఫ్రెండ్లీ వాహనాలకు మాత్రమే. 4 గంటల వరకు ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని ఎకో ఫ్రెండ్లీ వాహనాలు వినియోగించుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com