ప్రైమ్ నౌ గా మారిన అమెజాన్ నౌ
- May 29, 2018
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన 'అమెజాన్ నౌ' సర్వీస్ ను 'ప్రైమ్ నౌ' సర్వీస్ గా పేరు మార్చింది. ఈ క్రమంలో అమెజాన్ తన ప్రైమ్ కస్టమర్లకు కేవలం 2 గంటల్లోనే ఇకపై సరుకులను డెలివరీ ఇవ్వనుంది. అల్ట్రా ఫాస్ట్ డెలివరీ పేరిట ఈ సేవను అమెజాన్ అందిస్తున్నది. కస్టమర్లు ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు 2 గంటల స్లాట్లలో తమకు అవసరం ఉన్న నిత్యావసర వస్తువులను ఆర్డర్ ఇవ్వవచ్చు. వాటిని 2 గంటల్లో డెలివరీ తీసుకోవచ్చు. ఇక ఈ అల్ట్రా ఫాస్ట్ డెలివరీ సర్వీస్ కు తోడు సేమ్ డే, నెక్ట్స్ డే డెలివరీని కూడా అమెజాన్ అందిస్తున్నది. ప్రస్తుతం ప్రైమ్ నౌ సేవలు దేశంలో ఉన్న బెంగుళూరు, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లోనే లభిస్తున్నాయి. ఆయా సిటీల్లో ఉండే వినియోగదారులు 10వేలకు పైగా ప్రొడక్ట్స్‌ను వేగంగా డెలివరీ తీసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, కిరాణా సరుకులు, మాంసం తదితర సామగ్రిని వారు కొనుగోలు చేయవచ్చు. అందుకు గాను అమెజాన్ సంస్థ బిగ్ బజార్, ఆదిత్య బిర్లా మోర్ తదితర సూపర్ మార్కెట్ల యాజమాన్యాలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. స్థానికంగా ఉండే ఆయా స్టోర్స్ నుంచి అమెజాన్ సరుకులను వినియోగదారులకు డెలివరీ అందిస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..