జగన్కు అస్వస్థత..మూడ్రోజుల పాటు...
- May 29, 2018
కిలోమీటర్లు కరిగిపోతున్నాయి. మైలురాళ్లు మాయమవుతున్నాయి. వైసీపీ అధినేతకు పశ్చిమ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువనేతకు తమ కష్టాలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాగా.. ప్రజాసంకల్ప యాత్రలో జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు.. మూడ్రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనతో మాట్లాడేందుకు, తమ కష్టాలు చెప్పుకునేందుకు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ జగన్ను చూసేందుకు మండుటెండను సైతం లెక్కచేయక రోడ్లపైనే నిరీక్షిస్తున్నారు. దీంతో కిలోమీటరు యాత్ర సాగాలంటే గంటకుపైగానే సమయం పడుతోంది. మంగళవారం జగన్ 10.8 కిలోమీటర్లు నడిచారు. తలతాడితిప్ప, మెంటేపూడి క్రాస్, బొబ్బనపల్లి, మత్స్యపురి, సీతారామపురం క్రాస్ మీదుగా కొవ్వూరు వరకు ప్రజాసంకల్పయాత్ర సాగింది. జగన్ ఇప్పటి వరకు 2192.5 కిలోమీటర్ల దూరం నడిచారు.
ప్రజాసంకల్ప యాత్ర 175వ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో సాగింది. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు ఈ నాలుగేళ్లుగా ఎంతో నష్టపోయామని జగన్ ఎదుట వాపోయారు. చంద్రబాబు పాలనలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. అందరి కష్టాలు విన్న జగన్.. తమ ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
మరోవైపు జగన్ పాదయాత్రలో సినీనటుడు పృథ్వీ సందడి చేశారు. యువనేతతో కలిసి నడిచి ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావం ప్రకటించారు. కాగా.. మంగళవారం పాదయాత్రలో జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జలుబు, జ్వరం, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నా.. అలాగే నడక కొనసాగించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. మూడ్రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఇవాళ ఉదయం జగన్ కొప్పర్రు నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి లిఖితపూడి, సారిపల్లి మీదుగా.. చిన్నమామిడిపల్లి, నర్సాపురం, స్టీమర్ రోడ్డు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..