దొంగని పట్టుకున్న 'ధైర్యవంతుడు'కి సన్మానం
- May 30, 2018
దుబాయ్ మునిసిపాలిటీ - హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న హామ్ది భాన్సి అనే యంగ్ అరబ్, ఓ దొంగని అత్యంత చాకచక్యంగా పట్టుకున్న ఘటనకు సంబంధించి, దుబాయ్ పోలీస్ అతన్ని సన్మానించింది. వివరాల్లోకి వెళితే, యూరోపియన్ టూరిస్ట్, ఆయన భార్య రోడ్డుపై వెళుతుండగా, ఆసియాకి చెందిన ముగ్గురు దొంగలు మహిళ చేతిలోనున్న బ్యాగ్‌ని లాక్కుని పారిపోయారు. టూరిస్ట్, ఆయన భార్య ఆందోళన చెందుతున్న విషయాన్ని హామ్ది గుర్తించి, వారి వద్దకు వెళ్ళి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారు చూపించిన మార్గంలో దొంగల కోసం అన్వేషించిన హామ్ది, కొంత దూరంలో దొంగల్ని కనుగొన్నారు. వెంటనే అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఓ దొంగని పట్టుకోగలిగారు హామ్ది. ఈలోగా పోలీసులూ అక్కడికి చేరుకున్నారు. హామ్ది, దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగ్‌ని బాధితులకు అందజేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీస్, హామ్దీని సన్మానించడం జరిగింది. బాధ్యతగల పౌరుడిగా తాను ఆ సమయంలో వ్యవహరించానని హామ్దీ చెప్పారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







