రెండ్రోజులు బ్యాంకులకు సెలవు.. మరి ఏటీఎంల పరిస్థితి.. ఆందోళనలో జనం
- May 30, 2018
గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఇప్పుడు జనం జేబుల్లో డబ్బులు ఉండడం లేదు. అన్ని కొనుగోలు వ్యవహారాలను కార్డుల ద్వారానే చక్కబెడుతున్నారు. మరి బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులు బంద్ పాటిస్తే.. డబ్బులు అర్జంటుగా అవసరమైతే.. ఏటీఎంలో డబ్బులు లేక పోతే పరిస్థితి ఏంటని జనం ఆందోళన చెందుతున్నారు. తమకు జీతాలు పెంచాలంటూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగక తప్పలేదని, ఈ సమ్మెలో మొత్తం 9 బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) తెలియజేసింది. ఈ రెండు రోజులు ఏటీఎంలు కూడా పనిచేయవని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని యూనియన్ కోరింది. ప్రజలు సాధ్యమైనంతవరకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు మాములుగానే పనిచేస్తాయని తెలిపింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







