జూన్ లో "బిగ్ బాస్-2"
- May 30, 2018
తెలుగు బుల్లితెరపై అత్యంత్య ప్రజాదరణ పొందిన షో 'బిగ్ బాస్'. అయితే ఈ షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం కూడా దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఇక 'బిగ్ బాస్' షో విజయవంతంగా ముగిసింది. తరువాత 'బిగ్ బాస్-2' ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో… ఈ షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం లేదని తెలిసింది. ఆ తరువాత బిగ్ బాస్-2 వ్యాఖ్యాతగా నాని, అల్లు అర్జున్ పోటీ పడుతున్నారనే వార్తలు విన్పించాయి. చివరకు నానినే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని ప్రకటించారు.
అయితే ఈ షో ఎప్పుడు మొదలవబోతుంది ? ఈ షోలో సెలెబ్రిటీలు ఎవరెవరు పాల్గొంటున్నారు ? అనే ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు కూడా నాని సమాధానం చెప్పేశాడు. జూన్ 10న బిగ్ బాస్ సీజన్ 2 మొదలవబోతుందని, మొత్తం 16 మంది సెలబ్రిటీలని, వంద రోజుల పాటు ఈ షో ఉంటుందని, తాను ఈల వేస్తున్న ఫొటోతో సహా ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..