అభిమన్యుడు ట్రైలర్

- May 30, 2018 , by Maagulf
అభిమన్యుడు ట్రైలర్

తమిళ నటుడు విశాల్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఇరుంబు థిరై. తెలుగులో ఈ చిత్రం అభిమన్యుడు గా రిలీజ్ కానుంది. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి గుజ్జలపూడి నిర్మించిన ఈ చిత్రం జూన్ 1న థియేటర్స్‌లోకి రానుంది. యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రంలో కీలకపాత్ర పోషించారు . తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో సీన్స్‌, డైలాగ్స్ మూవీపై చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మైండ్ గేమ్ మూవీగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుండగా, ఇందులో సమంత.. రతీదేవి అనే సైకాలజిస్ట్‌ పాత్రలో,అర్జున్ టెక్నాలజీ నిపుణుడిగా కీలక పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com