స్టార్ ప్లేయర్స్‌పై కాసుల వర్షం.. 1.15 కోట్లకు దీపక్ హుడాను
- May 30, 2018
ప్రో కబడ్డీ ఆటగాళ్ళ వేలంలో తొలిరోజు స్టార్ ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిసింది. మను గోయత్ అత్యధిక ధర పలికాడు. గోయత్‌ను హర్యానా స్టీలర్స్ 1.51 కోట్లకు దక్కించుకోగా.. తెలుగు టైటాన్స్ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి 1.29 కోట్లకు అమ్ముడయ్యాడు. వేలంలో రాహుల్ చౌదరి కోసం గట్టిపోటీ నడిచింది. అయితే ఎఫ్‌బిఎం పధ్ధతిలో రాహుల్‌ను టైటాన్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వీరి తర్వాత దీపక్ హుడా 1.15 కోట్లకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేయగా.. మరో స్టార్ ప్లేయర్ నితిన్ తోమర్‌ను 1.15 కోట్లకు పుణేరి పల్టాన్ దక్కించుకుంది. అలాగే రిషాంక్ 1.11 కోట్లు, ఫజల్ అట్రాచలి 1 కోటి, సురేందర్ నాడా 75 లక్షలు , సందీప్ దుల్ 66 లక్షలు, దీపాల్ నర్వాల్ 57 లక్షలకు అమ్ముడయ్యారు. రెండురోజుల పాట జరగనున్న వేలంలో దాదాపు 422 మంది ఆటగాళ్ళు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..