మహేష్ ప్రాణ మిత్రుడిగా అల్లరి నరేష్!
- May 30, 2018
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' చిత్రంతో మంచి ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు 25 వ చిత్రానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశిపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట.
ఈ చిత్రం షూటింగ్ వచ్చేనెల 8వ తేదీనగానీ .. 10వ తేదీనగాని మొదలుపెట్టనున్నారు. తొలి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మరో స్పెషల్ ఏంటంటే..మహేష్ బాబు ప్రాణ మిత్రుడిగా అల్లరి నరేష్ నటించబోతున్నాడట.
మహేష్ సంపన్న కుటుంబానికి చెందినవాడైతే..అతి పేద కుంటుంబలో ఉన్న యువకుడిగా అల్లరి నరేష్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే దర్శక నిర్మాతలు కలిసి నాలుగు ట్యూన్స్ ను ఫైనలైజ్ చేశారట. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..