పూనమ్ పంట పండినట్లే మరి!

- May 31, 2018 , by Maagulf
పూనమ్ పంట పండినట్లే మరి!

ఈ మధ్యకాలంలో నటిగా కన్నా తన ట్వీట్లతోనే ఎక్కువగా పాపులర్ అయింది పూనం కౌర్. తన ట్విటర్ లో తన టార్గెట్ ఏ దర్శకుడో, ప్రముఖ నటుడో ఎవరో చెప్పకుండానే పరోక్షంగా సెటైర్లు వేస్తూ..నెటిజన్ల మతులు పోగొట్టిన ఈ భామ.. బాలీవుడ్ డెబ్యూ నటి అయింది. ఓ చక్కని ఆఫర్ తన్నుకొచ్చి.. అంకుష్ భట్ దర్శకత్వం వహిస్తున్న ఓ కామెడీ చిత్రంలో బుక్ అయింది.

3 దేవ్ అనే తమాషా టైటిల్ తో వస్తున్న సినిమాలో రాధ పాత్రకు పూనం కౌర్ ఎంపికయింది. ఈ రోల్ కోసం స్వీట్ అండ్ బబ్లీగా కనిపించే అమ్మాయి కోసం వెదుకుతుండగా..ఎవరో ఈమె పేరు సజెస్ట్ చేశారని, రాధ రోల్ కు ఈమె పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించిందని అంకుష్ భట్ తెలిపారు. ఈ పూర్తి వినోదాత్మక మూవీలో రీమాసేన్, కరణ్ సింగ్ గ్రోవర్, రవిదూబే, కునాల్ రాయ్ కపూర్, టిస్కా చోప్రా, ప్రొసెంజిత్, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com