హైదరాబాద్‌లో అధునాతన సౌకర్యాలతో బస్టాపులు
- May 31, 2018
హైదరాబాద్:బస్టాపుల్లో బస్సుల కోసం నిలబడి ఎదురు చూడాల్సిన పనిలేదు.. కూల్ వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ జర్నీని మెమరబుల్‌గా మార్చుకోవచ్చు.. హైదరాబాద్‌లో అధునాతన సౌకర్యాలతో బస్టాపులు అందుబాటులోకి వస్తున్నాయి.. ఖైరతాబాద్, కూకట్‌పల్లిలో ఏసీ బస్ షెల్టర్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరం మొత్తం 826 అత్యాధునిక బస్ షెల్టర్స్ అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఆధునిక బస్ షెల్టర్లు నగరానికి కొత్త సొబగులు అద్దనున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 826 ప్రాంతాల్లో అత్యాధునిక బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. ఖైరతాబాద్, కూకట్‌పల్లిలో ఈ కొత్త బస్ షెల్టర్లు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభించారు. శిల్పారామం, ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయం, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుల్లో ఈ బస్ షెల్టర్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలతో నగరంలో కాలుష్యం తగ్గిస్తామని చెప్పారు.
కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్లలో ఏసీతోపాటు.. వైఫై, సీసీటీవీ, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, టాయ్‌లెట్లు.. అత్యవసర సమయంలో హారన్ వంటి మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఫారిన్ కంట్రీస్‌లోని కొన్ని నగరాల్లో మాత్రమే ఇలాంటి బస్ షెల్టర్లు ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలో హైదరాబాద్ కూడా చేరింది. జీహెచ్‌ఎంసీ, పీపీపీ పద్ధతిలో వీటి నిర్మాణం చేపడుతున్నాయి. ఈ బస్ షెల్టర్స్ నిర్వహణను యుని యాడ్స్ సంస్థ చూస్తోంది..
మిగిలిన షెల్టర్లను కూడా ఆర్నెల్లలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. త్వరలో 3,800 ఆర్టీసీ బస్సులు ఆధునీకరించనున్నట్లు చెప్పారు. 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







