నాకు నిశ్చితార్ధం జరిగింది:శ్వేతా బసు
- June 03, 2018
'కొత్తబంగారులోకం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది శ్వేతాబసు ప్రసాద్. ఆ సినిమాతో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది. ఆ సినిమా సమయంలో శ్వేత నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత శ్వేత నటించిన చిత్రాలు ఆశించదగ్గస్థాయిలో ఆడలేదు.కాస్త 'రైడ్' పరవాలేదనిపించినా మిగతావి నిరాశపరిచాయి. దాంతో ఆమె కెరీర్ గాడి తప్పింది. ఆ తరువాత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ క్రమంలో శ్వేత బసు బాలీవుడ్ సీరియళ్ళలో నటిస్తోంది. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న ఈ బ్యూటీ ఇటీవల ప్రేమలో పడింది. లవ్ లో పడటమే కాదు తనకు కాబోయే అత్తమామలను కూడా పెళ్ళికి ఒప్పించింది. ఈ విషయం స్వయంగా ఆమె వెల్లడించింది. ముందుగా అబ్బాయిలు పెళ్లి ప్రస్తావన తెచ్చే ఈ రోజుల్లో ముందుగా తన బాయ్ ఫ్రెండ్ కు తానే ప్రొపోజ్ చేశానని అతనే రోహిత్ అని చెప్పింది. సంవత్సరంక్రితం గోవాలో తామిద్దరం కలిసినప్పుడు రోహిత్ కు ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. పైగా తాను.. రోహిత్ ఇంట్లో వారికీ కూడా నచ్చడంతో పెళ్లికి ఒప్పుకొన్నారు. ఆలా అత్తమామలను ఒప్పించాను. కానీ పెళ్లికి తొందరేం లేదు. ఇప్పటికే మా ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. మా జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదని శ్వేత వెల్లడించింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







